విజయ్ దేవరకొండతో జాన్వీ కపూర్

Janhvi kapoor romance with vijay devarakonda
Vijay Devarakonda and Jhanvi kapoor

విజయ్ దేవరకొండ తో జాన్వీ  కపూర్ నటించనున్నట్లు తెలుస్తోంది . జాన్వీ కపూర్ కూడా ఇంతకుముందే విజయ్ దేవరకొండ యాక్టింగ్ అంటే ఇష్టమని అతడితో నటించాలని ఉందని చెప్పి షాక్ ఇచ్చింది . ఇక విజయ్ దేవరకొండ కూడా జాన్వీ కపూర్ తో నటించాలనే ఆసక్తి ని తెలియజేసాడు . అయితే ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నది ఎవరో తెలుసా …….. దర్శక దిగ్గజం కరణ్ జోహార్ . జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా పరిచయం చేసింది కరణ్ అన్న విషయం తెలిసిందే .

ఇక రెండో సినిమా కూడా మరొకరికి చేయకుండా తన ఆధీనంలోనే ఉంచుకున్నాడు జాన్వీ కపూర్ ని . దాంతో విజయ్ దేవరకొండ – జాన్వీ కపూర్ ల కాంబినేషన్ లో ఓ సినిమా చేయడానికి కరణ్ జోహార్ సన్నాహాలు చేస్తున్నాడు . విజయ్ దేవరకొండ కు అనూహ్యంగా క్రేజ్ రావడంతో ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ బాలీవుడ్ లలో కూడా క్రేజ్ ఏర్పడింది . ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఆ క్రేజే వేరు అని చెప్పొచ్చు .

English Title: Janhvi kapoor romance with vijay devarakonda