ఆ హీరోయిన్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన జాన్వీ!!


ఆ హీరోయిన్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన జాన్వీ
ఆ హీరోయిన్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన జాన్వీ

ఇస్మార్ట్ శంకర్’ హిట్‌తో మాంచి జోరు మీదున్న పూరీ జగన్నాథ్ – ‘డియర్ కామ్రేడ్’ ఫలితంతో ఢీలా పడిన విజయ్ దేవరకొండ కలిసి సినిమా చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. క్రేజీ కాంబినేషన్‌ కావడంతో ఈ సినిమాపై అప్పుడే ఊహాగానాలు, అంచనాలు ప్రారంభమయ్యాయి. అలాగే, ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు  తెరపైకి వస్తున్నాయి.  అదేంటంటే ఈ చిత్రంకోసం జాన్వికపూర్ ని హీరోయిన్ గా తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. మరి ఏమైందో ఏమిటో జాన్వీ నుండి ఎలాంటి స్పందన రాలేదు.

అసలు జరిగిన విషయం ఏంటంటే ‘ఈ సినిమాలో నటించే విషయంలో నిర్మాతల్లో ఒకరైన ఛార్మీ.. ముంబై వెళ్లి మరీ జాన్వీ కపూర్‌తో మంతనాలు జరిపిందని తెలుస్తోంది. ముందు ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన ఈ యంగ్ హీరోయిన్. అందుకోసం రూ. 4 కోట్లు డిమాండ్ చేసిందని ప్రచారం జరుగుతోంది.

జాన్వీ చెప్పిన అమౌంట్‌కు ఛార్మీ దిమ్మతిరిగిపోయిందని అంటున్నారు. ఇక, చేసేదేం లేక ఆమె అక్కడి నుంచి వచ్చేసిందని ఫిలింనగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దీనిపై ఛార్మి ఇంకా స్పందించలేదు. ఈ చిత్రానికి ‘ఫైటర్’ టైటిల్ పరిశీలనలో వుంది.. పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌, పూరి కనెక్ట్స్‌ బేనర్లు పై పూరి, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రొడక్షన్ బాధ్యతలు అన్నీ ఛార్మీ దగ్గరుండి చూసుకోనుంది..!