మరో సినిమాను చేజిక్కించుకున్న జాతిరత్నాలు భామ

మరో సినిమాను చేజిక్కించుకున్న జాతిరత్నాలు భామ
మరో సినిమాను చేజిక్కించుకున్న జాతిరత్నాలు భామ

చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన జాతిరత్నాలు భారీ విజయం సాధించింది. ఈ చిత్రం థియేటర్లలో నవ్వులు పూయించింది. ఈ దెబ్బకు ఏకంగా 30 కోట్ల షేర్ మార్క్ ను రీచ్ అయింది జాతిరత్నాలు. నవీన్ పోలిశెట్టి హీరోగా తిరుగులేని ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. దర్శకుడికి కూడా మంచి పేరే వచ్చింది. ఇక నాగ్ అశ్విన్ కు నిర్మాతగా మంచి పేరుతో పాటు బోలెడు లాభాలు కూడా వచ్చాయి.

అయితే జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన భామ ఫారియా అబ్దుల్లాకు మాత్రం వెంటనే అవకాశాలు రాలేదు. రవితేజ సరసన నటిస్తోంది అన్నారు కానీ ఆమె స్థానంలో దివ్యంశ కౌశిక్ ను తీసుకున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఈ జాతిరత్నాలు భామ హీరోయిన్ గా అవకాశం పట్టినట్లు తెలుస్తోంది. మంచు విష్ణు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఢీ అండ్ ఢీ అనౌన్స్ అయిన విషయం తెల్సిందే. ఈ చిత్రంలో హీరోయిన్ ను ఫారియాను అనుకుంటున్నారు.