కంగ‌న ర‌నౌత్‌‌పై క్రిమిన‌ల్ కేసు!


కంగ‌న ర‌నౌత్‌‌పై క్రిమిన‌ల్ కేసు!
కంగ‌న ర‌నౌత్‌‌పై క్రిమిన‌ల్ కేసు!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. సుశాంత్ రాజ్‌పుత్ మృతి త‌రువాత ముంబై సీఎంతో డైరెక్ట్ వార్‌కు సిద్ధ‌మై సంచ‌ల‌నం సృష్టించిన కంగ‌న‌పై  ప్ర‌ముఖ బాలీవుడ్ గేయరచయిత జావేద్ అక్తర్ ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. ముంబైలోని అంథేరీలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు కంగ‌న‌పై క్రిమిన‌ల్ కేసు పెట్టారు. ఓ వార్తా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగ‌న‌ తన ప్రతిష్టను దెబ్బతీశారని  జావేద్ అక్త‌ర్ త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు.

త‌న‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన కంగ‌న‌పై క్రిమిన‌ల్ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఈ సంద‌ర్‌భంగా ఆయ‌న డిమాండ్ చేశారు. దీంతో మ‌రోసారి బాలీవుడ్ హీటెక్కింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్ప‌ద మృతి  కేసులో కంగన‌ రనౌత్ తన పేరును అనవసరంగా లాగారని, బాలీవుడ్  నెపోటిజానికి వ్య‌తిరేకంగా పోరాడుతోంద‌ని. ఇదే సుశాంత్ మ‌ర‌ణానికి దారితీసింద‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింద‌ని చెప్పుకొచ్చారు.

బాలీవుడ్‌లో స్వపక్షపాతం గురించి వివిధ న్యూస్ ఛానెళ్లకు ఆమె ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఆమె తన ఆరోపణలను నిరూపించలేకపోతే తన పద్మశ్రీని తిరిగి ఇస్తానని ఆమె చెప్పింది. జూన్ 14 న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బాంద్రాలోని తన నివాసం చనిపోయాడు. దీనికి సంబంధించి సిబిఐ దర్యాప్తు గ‌త కొన్ని రోజులుగా జరుగుతోంది. ఈ కేసులో జావేద్ అక్త‌ర్‌ని కూడా విచారించాల‌ని కంగ‌న ఆ మ‌ధ్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. దీంతో ఆగ్ర‌హించిన జావేద్ అక్త‌ర్ కంగ‌న పై ప‌రువు న‌ష్టం దావా వేయాల‌నుకున్నారు. తాజాగా కంగ‌న‌పై క్రిమిన‌ల్ కేసు ఫైల్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. దీనిపై కంగ‌ రియాక్ష‌న్ ఏంట‌న్న‌ది వేచి చూడాల్సిందే.