వ్యభిచారం చేయమంటూ అడుగుతున్నారట


Jayalakshmi says: actress like me asked to be s*x worker

ఈజీ మని కోసం వ్యభిచారం చేయాలంటూ పదేపదే మెసేజ్ లు వస్తుండటంతో పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది నటి జయలక్ష్మి . పలు చిత్రాలతో పాటుగా సీరియల్ లలో నటించిన ఈ భామ కు మొదట్లో వ్యభిచారం చేయాలంటూ మెసేజ్ వచ్చిందట దాన్ని లైట్ గా తీసుకొని డిలీట్ చేసింది అయితే మరో నెంబర్ నుండి ఇలాంటి మెసేజ్ రావడమే కాకుండా ఇలా వ్యభిచారం చేస్తే రోజుకి లక్షల్లో ఆదాయం వస్తుందని నెలలో కోట్ల లో డబ్బు సమకూర్చుకోవచ్చని రావడంతో షాక్ అయిన జయలక్ష్మి ఆ మెసేజ్ ని కూడా డిలీట్ చేసిందట అయితే ఇలాంటి మెసేజ్ లు డిలీట్ చేసినా వస్తూనే ఉన్నాయట ! అలాగే ఒక్క జయలక్ష్మి కి మాత్రమే కాకుండా దాదాపు 50 మంది నటీమణులకు ఇలాంటి మెసేజ్ వచ్చాయని అంటోంది .

జయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు ని స్వీకరించిన పోలీసులు వెంటనే తీగ లాగడంతో డొంక కదిలింది , ప్రస్తుతం పోలీసుల అదుపులో ఇద్దరు ఉన్నారు . వాళ్ళ నుండి మరిన్ని వివరాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు . పలువురు నటీమణులకు డబ్బు ఆశ చూపించి వ్యభిచారంలోకి దింపడానికి పెద్ద ఎత్తన ప్రయత్నాలు చేస్తున్నారనడానికి ఇదే నిదర్శనం .

English Title: Jayalakshmi says: actress like me asked to be s*x worker