అతడితో అక్రమ సంబంధం లేదంటోంది


Jayaprada opens her relation with amar singh

రాజకీయ నాయకుడు అమర్ సింగ్ తో నాకు ఎలాంటి అక్రమ సంబంధం లేదని , కానీ బయటి వాళ్ళు మాత్రం రకరకాలుగా అనుకుంటుంటారని దానికి నేను బాధ్యురాలిని కాదు అని సంచలన వ్యాఖ్యలు చేసింది జయప్రద . హీరోయిన్ గా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జయప్రద తెలుగుదేశం పార్టీలో చేరి పార్లమెంట్ కు ఎన్నికయ్యింది . ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వదిలేసి ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లోకి వెళ్ళింది .

 

అక్కడ అమర్ సింగ్ తో ఉన్న సాన్నిహిత్యం వల్ల కొన్నాళ్ళు సమాజ్ వాది పార్టీ నుండి నెట్టుకొచ్చింది . అయితే జయప్రద నియోజకవర్గం లో అజాం ఖాన్ అనే వ్యక్తి వల్ల చాలా అవమానాలు ఎదుర్కొంది . ఆ సమయంలో జయప్రదకు అండగా నిలిచింది అమర్ సింగ్ . అయితే అప్పటికే ఈ ఇద్దరి బంధం గురించి రకరకాల పుకార్లు షికారు చేసాయి . అందుకే నేను అందరి ముందు అమర్ సింగ్ కు రాఖీ కట్టినప్పటికీ దాన్ని కూడా వివాదం చేస్తారు అందుకే దాని గురించి పెద్దగా మాట్లాడేది లేదు కానీ అమర్ సింగ్ నాకు గురువుతో సమానం అంటూ అసలు విషయాన్నీ చెప్పింది జయప్రద .