మహేష్ బాబుకి అవార్డు రావడం ఖాయమట !

మహర్షి చిత్రంలోని నటనకు గాను మహేష్ బాబు కు ఉత్తమ నటుడి అవార్డు రావడం ఖాయమని అంటోంది సీనియర్ నటి జయసుధ . తాజాగా జయసుధ ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మహర్షి సినిమా గురించి మహేష్ బాబు గురించి పలు విషయాలు వెల్లడించింది . మహేష్ బాబు నటిస్తున్నప్పుడు అతడి నటనని చూస్తూ కన్నీళ్ల పర్యంతం అయ్యానని , డైలాగ్ చెప్పడం మర్చిపోయానని అంతగా మహేష్ అద్భుతమైన నటనని ప్రదర్శించాడని కొనియాడింది జయసుధ .

మహర్షి చిత్రంలో జయసుధ కూడా నటించింది . దాంతో మహేష్ బాబు నటనకు తప్పకుండా ఉత్తమ నటుడు అవార్డు వస్తుందని అంటోంది . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మే 9 న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . అశ్వనీదత్ , దిల్ రాజు , పివిపి లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా పూజా హెగ్డే మహేష్ సరసన నటించింది .