పవన్ కళ్యాణ్ ని విమర్శించిన జయసుధ

సినీ నటి , మాజీ ఎం ఎల్ ఏ జయసుధ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడింది . ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సినిమా వాళ్ళని విమర్శిస్తుంటే పవన్ కళ్యాణ్ మాత్రం నిమ్మకు నీరెత్తనట్లు గా వ్యవహరిస్తున్నాడని అందుకు కారణం తెలుగుదేశం – జనసేన రహస్య ఒప్పందమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది జయసుధ .

ఇటీవల కాలంలో సినిమా రంగంలోని పలువురు నటీనటులు జగన్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు అంతేకాదు జగన్ పార్టీ తరుపున పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తున్నారు దాంతో చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడు నటీనటుల పట్ల . అందులో జయసుధ కూడా ఉంది దాంతో చంద్రబాబు పై మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది జయసుధ . ఎవరెన్ని డ్రామాలు ఆడినా ఆంధ్రప్రదేశ్ లో గెలిచేది మాత్రం జగన్ అంటూ చెప్పుకొచ్చింది జయసుధ . కాంగ్రెస్ పార్టీలో ఎం ఎల్ ఏ అయిన జయసుధ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ కు మద్దతు ఇచ్చింది కానీ జగన్ వ్యవహారశైలీ నచ్చక మళ్ళీ కాంగ్రెస్ లోనే కొనసాగింది . ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరింది , ఇక ఎన్నికలు సమీపించిన ఈ తరుణంలో మళ్ళీ జగన్ పార్టీలో చేరింది చంద్రబాబు పై పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తోంది .