వైర‌ల్‌గా మారిన జ‌య‌సుధ లుక్‌!

 

Jayasudha Shoking look goes viral
Jayasudha Shoking look goes viral

జయసుధ టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సహజ నటిగా పేరు తెచ్చుకున్న విష‌యం తెలిసిందే. గ‌త కొంత కాలంగా ఈ సీనియ‌ర్ న‌టి సినిమాల్లో క‌నిపించ‌డం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు కొత్త‌గా ఏ చిత్రాన్నీ అంగీక‌రించాలేదు.  ఈ మధ్యకాలంలో కొన్ని పెద్ద చిత్రాల్లో మాత్రమే కనిపించింది. అయితే తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మార‌డం, అందులో ఆమె లుక్ చూసిన వారంతా షాక‌వుతున్నారు.

జయసుధ నటించిన ఓ వీడియో ఆన్‌లైన్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. అందులో జ‌య‌సుధ క‌న‌పిస్తున్న తీరు ప‌లువురిని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. సాధారణ సమయాల్లో కాకుండా ఆమె వైట్ క‌ల‌ర్ జుట్టుతో కనిపిస్తోంది. పైగా హాఫ్ క‌ట్ హెయిర్‌తో షాకింగ్ లుక్‌లో జ‌య‌సుధ‌ని చూసిన వారంతా ఒక్క‌సారిగా అవాక్క‌వుతున్నారు.

ఎప్పుడూ బ్లాక్ హెయిర్‌తో క‌నిపించే జ‌య‌సుధ ఇలా వైట్ హెయిర్‌తో పాటు షార్ట్ హెయిర్‌తో క‌నిపిస్తున్న తీరు ప‌లువురిని అవాక్క‌య్యేలా చేస్తోంది. మేకప్ లేదు. సాధారణంగా ఆమె జుట్టుకు రంగు వేస్తుంది.. కానీ ఫిల్మ్ షూట్స్ లేనందున ఆమె జుట్టుకు రంగు వేసుకోవ‌డం లేద‌ని, ఆ కార‌ణంగానే ఇలా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు.