బ్రేకింగ్ – మంత్రి జేసీ సోద‌రుడికి క‌రోనా!


బ్రేకింగ్ - మంత్రి జేసీ సోద‌రుడికి క‌రోనా!
బ్రేకింగ్ – మంత్రి జేసీ సోద‌రుడికి క‌రోనా!

టిడీపీ నేత జేసీ దివాక‌ర్ రెడ్డి సోద‌రుడు, క‌డ‌ప జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి ‌క‌రోనా బారిన ప‌డ్డారు. క‌డ‌ప జైలులో వున్న ఆయ‌న‌కు జ‌లుబు, ద‌గ్గువంటి ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో జైలు అధికారులు అనుమానించి క‌రోనా ప‌రీక్ష‌లు చేయించారు. ఆ ప‌రీక్ష‌ల్లో జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డికి క‌రోనా సోకిన‌ట్టు నిర్ధార‌ణ అయ్యింది. దీంతో జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డిని ప్ర‌త్యేక గ‌దిలో వుంచి వైద్యం అందిస్తున్నారు.

ఇటీవ‌ల ఓ ద‌ళిత పోలీసు అధికారిన దూషించిన కేసులో ఆయ‌న‌పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదైన విష‌యం తెలిసిందే. ఈ కేసు కార‌ణంగా ఆయ‌న‌ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఆదివారంతో విచార‌ణ ముగిసింది. దీంతో ఆయ‌న‌ను క‌డ‌ప జైలుకు త‌ర‌లించారు. వాహ‌నాల అక్ర‌మ కొనుగోలు వ్య‌వ‌హారంలో జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి ని అరెస్ట్ చేశారు. ఆ త‌రువాత జైలుకి త‌ర‌లించారు.

ఈ కేసులో బెయిల్ పొందిన జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి బ‌య‌టికి రాగానే త‌న అనుచ‌ర‌గ‌ణంలో తాడిప‌త్రిలో హ‌ల్‌చ‌ల్ చేశారు. రోడ్ షో చేశారు. దీన్ని అడ్డుకోవ‌డానికి ప్ర‌య‌త్నించిన ఓ ద‌ళిత అధికారిని జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి దూషించ‌డంతో అత‌నిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదైంది. తిరిగి ఆయ‌న‌ను క‌డ‌ప జైలుకు త‌ర‌లించ‌డం, అక్క‌డి ఖైదీల‌కు క‌రోనా సోక‌డంతో తాజాగా ఆయ‌న కూడా క‌రోనా బారిన ప‌డ్డారు.