ట్రైల‌ర్ టాక్‌: అర్థం కాలేదు కానీ..కాన్సెప్ట్ అదిరింది!

ట్రైల‌ర్ టాక్‌: అర్థం కాలేదు కానీ..కాన్సెప్ట్ అదిరింది!
ట్రైల‌ర్ టాక్‌: అర్థం కాలేదు కానీ..కాన్సెప్ట్ అదిరింది!

ఏదైనా కొత్త‌గా ప్ర‌య‌త్నించ‌డంలో వ‌ర్మ అండ్ టీమ్ ఎప్పుడ ముందుంటారు. టెక్నిక‌ల్‌గా, మేకింగ్ ప‌రంగా ప్ర‌యోగాలు చేస్తుంటారు. ఆయ‌న శిష్యుడు జేడీ చ‌క్ర‌వ‌ర్తి న‌టిస్తున్న తాజా చిత్రం `MMOF` కూడా ఇదే త‌ర‌హా కొత్త పంథాలో వినూత్నమైన క‌థ‌, క‌థ‌నాల‌తో రూపొందిన‌ట్టు క‌నిపిస్తోంది. జేడీ చ‌క్ర‌వర్తి, అక్ష‌త‌, అక్ష‌త ముద్గ‌ల్, బెన‌ర్జీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ ప్రొడ‌క్ష‌న్స్ అండ్ జేకే క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై రాజ‌శేఖ‌ర్‌, జేడీ ఖాసిమ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యెన్ య‌స్‌. సీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

ఈ చిత్ర ట్రైల‌ర్‌ని రామ్‌ గోపాల్‌ వ‌ర్మ రిలీజ్ చేశారు. నా మైండ్ స్లో అయ్యిందా? లేదా ఈ సినిమా తీసిన వాళ్ల మైండ్ స్పీడ్ అయిందా? అని వ‌ర్మ కామెంట్ చేయ‌డం సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. `ఒక రోజు నేను అడ‌విలో వెళుతుంటే స‌డెన్‌గా పులి ఎదురైంది…భ‌మంతో ప‌రుగెత్తాను. పులి నా వెంట‌ప‌డింది.. పులి నా వెంట‌ప‌డుతుంది నేను పరుగెడుతున్నాను. నేను ప‌రుగెడుతూనే వున్నాను పులి నా వెంట‌ప‌డుతూనే వుంది. అలా ప‌రిగెత్తి ఓ కొండ‌పైకి ఎక్కిచూస్తే.. ఎద‌రుగా చెట్టుక‌నిపించింది… అంటే జేడీ చ‌క్ర‌వ‌ర్తి వాయిస్‌తో ట్రైల‌ర్‌లో క‌థ మొద‌లైంది…ఇంత‌కీ ఈ క‌థ‌లో పులి ఎక్క‌డుంది? . పాము ఎవ‌రు? మ‌ధ్య‌లో ఇంట‌ర్వెల్ సీన్‌… క్లైమాక్స్ … మొత్తానికి సినిమాలో ఏదో వుంది అనిపించేలా ట్రైల‌ర్‌ని క‌ట్ చేసిన విధానం యునిక్‌గా వుంది.

ట్రైల‌ర్‌లోనే సినిమా ప్రారంభం, ఇంట‌ర్వెల్‌, క్లైమాక్స్‌ని వెల్ల‌డిస్తూ క‌ట్ చేసిన ట్రైల‌ర్ బ‌హుషా ఇదే నేమో. ఓ పాత ధియేట‌ర్ నేప‌థ్యంలో సాగే క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా సినిమా సాగుతుంద‌ని తెలుస్తోంది. అయితే క‌థ ఏంటి? ఎలాంటి మ‌లుపులు తిరుగుతుంది? అన్న‌ది మాత్రం కొంచెం క‌న్ఫ్యూజింగ్‌గా వుంది. అదే ఈ చిత్రానికి సేలింగ్ పాయింట్‌గా క‌నిపిస్తోంది. క్యూరియాసిటీని పెంచిన‌ప్పుడే థీయేట‌ర్‌కి ప్రేక్ష‌కుడిని ర‌ప్పించ‌గ‌లం అన్న సూత్రాన్ని ఫాలోఅయి ఈ ట్రైల‌ర్‌ని క‌ట్ చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. ఆ విష‌యంలో ఈ చిత్ర టెక్నిక‌ల్ బృందం, ద‌ర్శ‌కుడు హండ్రెడ్ ప‌ర్సెంట్ పాసైపోయారు. ఆత్యంతం ఆస‌క్తిక‌రంగా సాగుతున్న ఈ చితం త్వ‌ర‌లోనే విడుద‌ల కాబోతోంది.