వ‌ర్మకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన జేడీ చ‌క్ర‌వ‌ర్తి!

వ‌ర్మకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన జేడీ చ‌క్ర‌వ‌ర్తి!
వ‌ర్మకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన జేడీ చ‌క్ర‌వ‌ర్తి!

వివాదాస్ప‌ద చిత్రాల ద‌ర్శ‌కుడిగా రామ్‌గోపాల్‌వ‌ర్మ బ్రాండ్ నేమ్ వుంది. ఆయ‌న ఏం చేసినా.. సోష‌ల్ మీడియాలో చిన్న ట్వీట్ చేసినా సంచ‌ల‌న‌మే. అలాటి వ‌ర్మ‌కు హీరో జేడీ చ‌క్ర‌వర్తికి మ‌ధ్య మంచి గురుశిష్యుల బంధం వుంది. మూస ధోర‌ణి చిత్రాల‌తో సాగుతున్న టాలీవుడ్‌కు`శివ‌` వంటి ట్రెండ్ సెట్ట‌ర్‌ చిత్రంతో రామ్‌గోపాల్‌వ‌ర్మ కొత్త మార్గాన్నినిర్దేశించారు. ఈ సినిమా త‌రువాత తెలుగు సినిమా స్వ‌రూప‌మే స‌మూలంగా మారిపోయింది.

వ‌ర్మ‌, జేడీ క‌లిసి తెలుగుతో పాటు హిందీలో చేసిన అన‌గ‌న‌గ ఒక రోజు, స‌త్య వంటి చిత్రాలు కొత్త ఒర‌వ‌డిని సృష్టించాయి. అయితే గ‌త కొంత కాలంగా జేడీ క్రేజ్ త‌గ్గింది. దీంతో అప్పుడ‌ప్పుడు సినిమాలు చేస్తున్నాడు జేడీ. తాజాగా `MMOF` పేరుతో ఓ థ్రిల్ల‌ర్ సినిమా చేస్తున్నారు. యెన్‌. ఎస్‌. సీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఒక థియేట‌ర్ నేప‌థ్యంలో సాగే ఈ చిత్ర ట్రైల‌ర్‌ని జేడీ చ‌క్క‌వ‌ర్తి గురువు రామ్‌గోపాల్వ‌ర్మ‌ సోమ‌వారం హైద‌రాబాద్‌లో రిలీజ్ చేశారు.

ట్రైల‌ర్ చూసిన వ‌ర్మ నాకంటే వీళ్లు కొంత అడ్వాన్స్‌గా వున్నారా?  లేక నేను వెన‌క‌బ‌డ్డానా? అనే అనుమానం త‌న‌కుక‌లుగులోంద‌ని, అయితే ట్రైల‌ర్ మాత్రం త‌న‌కు అర్థం కాలేద‌ని స్ప‌ష్టం చేశాడు. త‌న సినిమా ట్రైల‌ర్ రిలీజ్ చేసిన గురువు రామ్‌గోపాల్‌వ‌ర్మ‌కు జేడీ ఓడ్కా ఫుల్ బాటిన్‌ని ప్ర‌త్యేకంగా ప్యాక్ చేసి మీడియా సాక్షిగా ఇవ్వ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ఈ గిఫ్ట్ త‌న‌కు ఎంత‌గానో ప‌న‌చ్చింద‌ని, దాన్ని ఇంటికి తీసుకెళ‌తాన‌ని వ‌ర్మ వేదిక సాక్షిగా చెప్పడం విశేషం.