జెర్సీ రెండు వారాల కలెక్షన్స్


జెర్సీ రెండు వారాల కలెక్షన్స్
జెర్సీ పోస్టర్

ఏప్రిల్ 19 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన నాని జెర్సీ 14 రోజుల్లో 26. 30 కోట్ల షేర్ వసూల్ చేసింది . 26 కోట్ల షేర్ రావడంతో జెర్సీ బయ్యర్లు నష్టాల బారి నుండి బయటపడినట్లే ! ఇక ముందు ముందు లాభాలు రానున్నాయి . అయితే జెర్సీ చిత్ర నిర్మాతలకు మాత్రం ముందుగానే లాభాలు వచ్చేసాయి . గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన జెర్సీ చిత్రాన్ని సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన విషయం తెలిసిందే . నాని సరసన శ్రద్దా శ్రీనాథ్ నటించిన జెర్సీ ప్రపంచ వ్యాప్తంగా ఏరియాల వారీగా ఇలా వసూళ్లు సాధించింది .

నైజాం – 8. 67 కోట్లు
సీడెడ్ – 1. 89 కోట్లు
కృష్ణా – 1. 40 కోట్లు
గుంటూరు – 1. 46 కోట్లు
ఈస్ట్ – 1. 40 కోట్లు
వెస్ట్ – 1. 07 కోట్లు
నెల్లూరు – 63 లక్షలు
వైజాగ్ – 2. 28 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 2. 50 కోట్లు
ఓవర్ సీస్ – 5 కోట్లు
మొత్తం – 26. 30 కోట్లు