3 రోజుల్లో 15 కోట్ల షేర్ రాబట్టిన జెర్సీ


3 రోజుల్లో 15 కోట్ల షేర్ ని రాబట్టి 50 కోట్ల దిశగా దూసుకుపోతోంది జెర్సీ . గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు . నాని హీరోగా నటించగా శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది . ఏప్రిల్ 19 న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తో దూసుకుపోతోంది . హిట్ టాక్ బాగా స్ప్రెడ్ కావడంతో మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 15 కోట్ల షేర్ రాబట్టాడు జెర్సీ .

 

నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది అలాగే నాని కెరీర్ లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రంగా నిలిచింది జెర్సీ . నాని తో పాటుగా కన్నడ భామ శ్రద్దా శ్రీనాథ్ కూడా అద్భుతంగా నటించడంతో ప్రేక్షకులు జేజేలు పలుకుతున్నారు.దర్శకులు గౌతమ్ పై కూడా ప్రశంసల వర్షం కురుస్తోంది . ఈ జోరు ఇలాగె కొనసాగితే అవలీలగా 50 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు .