చరణ్ కు మూడు కథలు చెప్పిన జెర్సీ దర్శకుడు


చరణ్ కు మూడు కథలు చెప్పిన జెర్సీ దర్శకుడు
చరణ్ కు మూడు కథలు చెప్పిన జెర్సీ దర్శకుడు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. అయితే ఈపాటికే ఈ సినిమా షూటింగ్ పూర్తవ్వాల్సి ఉన్నా కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పటికీ కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం మే తో ఈ చిత్ర షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. మే తర్వాత రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ నుండి ఫ్రీ అవ్వనున్నాడు. అయితే దాని తర్వాత కొరటాల శివ సినిమాలో నటించనున్నాడు. చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే సాగుతోంది. కేవలం 100 రోజుల వర్కింగ్ డేస్ లో ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు కొరటాల శివ అండ్ టీమ్.

ఈ చిత్రంలో చరణ్ ఒక కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెల్సిందే. దాదాపు 20 నిమిషాల నిడివి ఉన్న పాత్ర కోసం మే నుండి డేట్స్ ఇచ్చాడు చరణ్. ఈ సినిమా తర్వాత తాను చేయబోయే చిత్రానికి ఆగస్ట్ నుండి డేట్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఇందుకోసం ఇప్పటినుండే కథలు వింటున్నట్లు తెలుస్తోంది. పలువురు దర్శకులు చరణ్ కు కథలు చెప్పగా ఇంకా ఎవరికీ ఓకే చెప్పలేదని సమాచారం.

ఆ దర్శకుల లిస్ట్ లో జెర్సీ చిత్రంతో తెలుగు వారిని ఇంప్రెస్ చేసిన గౌతమ్ తిన్ననూరి కూడా ఉన్నాడు. ప్రస్తుతం జెర్సీ హిందీ వెర్షన్ సినిమా కోసం బిజీగా ఉన్న గౌతమ్ సమయం తీసుకుని చరణ్ కోసం కథలు వినిపించినట్లు తెలుస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు చరణ్ కు గౌతమ్ వినిపించాడట. అయితే దేనికీ చరణ్ ఎస్ చెప్పలేదు. మూడూ బాగున్నాయని చెప్పినట్లు సమాచారం. మరో రెండు, మూడు నెలల్లో తన తర్వాతి సినిమాపై నిర్ణయం తీసుకోనున్నాడు.