జెర్సీ డైరెక్టర్ తో రాంచరణ్మెగా పవర్ స్టార్ రాంచరణ్ కోసం జెర్సీ డైరెక్టర్ ఓ కథ రాసుకున్నాడట ! ఇక ఇప్పుడేమో జెర్సీ సూపర్ హిట్ కావడంతో ఆ కథ కు పనిచెప్పే పనిలో ఉన్నాడట ! చరణ్ కోసం కథ ఎప్పుడో రాసుకున్నప్పటికీ నన్ను నమ్ముతారా ? కథ వినే ఛాన్స్ ఇస్తారా ? అనే అనుమానం ఉండేది కాబట్టి చరణ్ ని కలవలేకపోయాడు గౌతమ్ తిన్ననూరి కానీ తాజాగా జెర్సీ తో సూపర్ హిట్ కొట్టేసాడు కాబట్టి చరణ్ కూడా సానుకూలంగా వ్యవరించడం ఖాయం కాబట్టి ఈ ఇద్దరి కాంబినేషన్ సెట్ అయినట్లే !

కాకపోతే 2020 వరకు ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా సెట్స్ కు వెళ్ళదు ఎందుకంటే చరణ్ ఆర్ ఆర్ ఆర్ కోసం పనిచేస్తున్నాడు కాబట్టి . అయితే చరణ్ ని తాజాగా గౌతమ్ తిన్ననూరి కలిశాడట ! ఇద్దరి మధ్య అయితే చర్చలు జరిగాయట కూడా . కానీ సినిమా రావాలంటే మాత్రం సమయం పట్టేలా ఉంది . మొత్తానికి జెర్సీ చిత్రంతో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయ్యాడు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి .