నాని పై మళ్ళీ విరుచుకుపడిన శ్రీ రెడ్డి


వివాదాస్పద భామ శ్రీ రెడ్డి మరోసారి నాని పై విరుచుకుపడింది . జెర్సీ చిత్రంలోని నాని నటనకు గాను ప్రేక్షకులంతా ముక్త కంఠంతో జేజేలు పలుకుతుంటే శ్రీ రెడ్డి మాత్రం విమర్శలు గుప్పించింది . కర్మరా బాబు …… సినిమాలో నటించినట్లుగా నిజ జీవితంలో కూడా నాని మంచివాడని నమ్ముతున్నారు అంటూ ఓ పోస్ట్ పెట్టింది శ్రీ రెడ్డి . ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది . నాని పై విమర్శలు చేయడంతో నాని ఫ్యాన్స్ శ్రీ రెడ్డి పై తిట్ల దండకం అందుకున్నారు .

నీ దగ్గర సాక్ష్యాలు ఉంటే బయట పెట్టు అంతేకాని నాని ని విమర్శించొద్దు అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు నాని అభిమానులు . గతకొంత కాలంగా నాని పై అదేపనిగా వ్యాఖ్యలు చేస్తూనే ఉంది శ్రీ రెడ్డి . అయితే శ్రీ రెడ్డి ఆరోపణలపై నాని లీగల్ గా చర్యలు తీసుకుంటానని ప్రకటించాడు కానీ అది ఎంతవరకు వచ్చిందో మాత్రం తెలీడం లేదు . ఆ వివాదాన్ని పక్కన పెడితే జెర్సీ మాత్రం మంచి హిట్ అయ్యింది .