100 కోట్ల క్లబ్ లో దఢక్


jhanvi kapoors dhadak joins 100 crore club

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ నటించిన దఢక్ చిత్రం అవలీలగా వంద కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించి ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేసింది . ఇషాన్ ఖట్టర్ – జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని బాలీవుడ్ దిగ్గజం కరణ్ జోహార్ నిర్మించాడు . జూలై 20న విడుదలైన దఢక్ చిత్రానికి మొదటి రోజునే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది . జాన్వీ కపూర్ నటన ఇషాన్ ఖట్టర్ యాక్షన్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు . ఇక బాలీవుడ్ ప్రముఖులైతే శ్రీదేవి ఇప్పుడు ఉండి ఉంటే ఎంతో సంతోషించేదని కళ్లనీళ్లు పెట్టుకున్నారు .

మొదటి చిత్రంతోనే సంచలన విజయాన్ని అందుకున్న జాన్వీ కి అప్పుడే స్టార్ డం వచ్చేసింది . ఏమాత్రం స్టార్ లు లేని ఈ చిత్రానికి భారీ వసూళ్లు రావడంతో ఆ చిత్ర బృందం చాలా చాలా సంతోషంగా ఉంది . మరాఠీ లో ప్రభంజనం సృష్టించిన సైరత్ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేసాడు కరణ్ జోహార్ . కేవలం రెండు వారాలు పూర్తికాకుండానే వంద కోట్ల క్లబ్ లో దఢక్ చేరడంతో ముందుముందు ఈ భామ మరెన్ని సంచలనాలు సృష్టిస్తుందో , జాన్వీ కి అప్పుడే వెల్లువలా ఆఫర్లు వచ్చి పడుతున్నాయి .

English Title: jhanvi kapoors dhadak joins 100 crore club