“పిట్టల గుంపు కాదు.మాది టీమ్.!” – ఝుండ్ టీజర్“పిట్టల గుంపు కాదు.మాది టీమ్.!” - ఝుండ్ టీజర్
“పిట్టల గుంపు కాదు.మాది టీమ్.!” – ఝుండ్ టీజర్

ఓపెన్ చెయ్యగానే ఒక బ్యాచ్.. అంతా అనాధలు. స్లమ్స్ లో ఉండే వాళ్ళు. చేతిలో కర్రలు, కత్తులు, ఇటుక రాళ్ళు, గొలుసులు, హాకీ బ్యాట్లు ఉన్నాయి. వెరైటీ ఏంటంటే వాళ్ళల్లో సరిగా నడవలేని దివ్యాంగులు కూడా ఉన్నారు. ఎవడినో కొట్టడానికి పెద్ద రౌడీల్లాగా వెళ్తున్నారు. వెనుక నుండి నెమ్మదిగా కెమెరా ప్యాన్ అవుతూ ఉంటుంది. వాళ్ళ నడకలో అమాయకత్వంతో కూడిన నిర్లక్ష్యంతో కలిసిన తెగింపు కనపడుతోంది. ఒక పక్క వెనుక నుండి ఒక పెద్దాయన వాయిస్ ఓవర్. “మాది ఏమీ పక్షుల గుంపు కాదు సర్.. టీం.. టీమ్”.

ఆయన ఎవరో కాదు మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. ఆ పిల్లలు అంతా ఫుట్ బాల్ ప్లేయర్స్. సార్ వాళ్ళ కోచ్. ఇదంతా కొత్తగా రిలీజ్ అవుతున్న “ఝుండ్” సినిమా టీజర్ లో ఉంది. అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ ఈ సినిమా టీజర్ ను ట్విట్టర్ లో షేర్ చేసారు. మరాఠీ సినిమా సైరత్ తో యావత్ దేశం దృష్టిని తనవైపుకు తిప్పుకున్న నాగరాజ్ మంజులే ఈ సినిమా కు డైరెక్టర్. ఇంకొంక విశేషం ఏంటంటే., సైరత్ సినిమా తో మొదలుపెడితే రీసెంట్ గా తెలుగులో వచ్చిన “జార్జి రెడ్డి” సినిమాకు పనిచేసి, ఇప్పుడు ఏకంగా అమితాబ్ ని తన ఫ్రేమ్ లో బందిస్తున్న నేషనల్ అవార్డ్ విన్నర్ డి.ఓ.పి యక్కంటి సుధాకర్ రెడ్డి ఈ సినిమాకు పనిచేస్తున్నారు. ఫిబ్రవరి 7న ఈ సినిమా రిలీజ్ కానుంది.