భ‌విష్య‌వాణి : అనుభ‌వించ‌క త‌ప్ప‌దు!


భ‌విష్య‌వాణి : అనుభ‌వించ‌క త‌ప్ప‌దు!
భ‌విష్య‌వాణి : అనుభ‌వించ‌క త‌ప్ప‌దు!

క‌రోనా కార‌ణంగా అన్ని రంగాలు కుదేల‌వుతున్నాయి. ఇక మీద‌ట కూడా ఈ ప‌రిస్థితి వుంటుంద‌ని, ప్ర‌జ‌లంతా జాగ్ర‌త్త‌గా వుండాల‌ని చేసుకున్న దానికి అనుభ‌వించ‌క త‌ప్ప‌ద‌ని ఉజ్జ‌యిన మ‌హంకాళి బోనాల్లో భాగంగా రంగం నిర్వ‌హించిన జోగిని స్వ‌ర్ణ‌ల‌త భ‌విష్య‌వాణిలో సోమ‌వారం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. రాబోయే కాలంలో మ‌రింత జాగ్ర‌త్త‌గా వుండాల‌ని తీవ్ర స్వ‌రంతో హెచ్చ‌రించారు.

ఎవ‌రు చేసుకున్న‌దానికి వారు అనుభ‌వంచ‌క త‌ప్ప‌ద‌ని ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశారు. క‌రోనాపై ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా వుండాల‌ని  ఈ సంద‌ర్భంగా సూచించారు. అయితే దీని బారి నుంచి త‌న ప్ర‌జ‌ల్ని కాపాడుకుంటాన‌న్నారు. క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌జ‌లు మ‌రిన్ని గ‌డ్డురోజులు ఎదుర్కోవాల్సి వుంటుంద‌న్నారు. ప్ర‌జ‌లంద‌రినీ సుఖ‌సంతోషాల‌తో చూస్తాన‌ని మాటిస్తున్నాన‌ని తెలిపారు.

గంగాదేవికి జ‌లాల‌తో అభిషేకం చేయండి.. బోనం స‌మ‌ర్పించండి..అమ్మ‌వారు క‌రుణించి ప్ర‌జ‌ల కోరికలు తీరుస్తుంది. ఐదు వారాల పాటు ప్ర‌తీ గ‌డ‌ప నుంచి ప‌ప్పు, బెల్లం శాక‌‌లు స‌మ‌ర్పించండ‌ని, మ‌రు బోనం స‌మ‌ర్పిస్తే ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఆప‌ద రానివ్వ‌న‌ని భ‌విష్య‌వాణి వినిపించారు.