“గురూ గారూ…! ఎందుకు సార్ మనకు ఇవన్నీ..”


“గురూ గారూ...! ఎందుకు సార్ మనకు ఇవన్నీ..”
“గురూ గారూ…! ఎందుకు సార్ మనకు ఇవన్నీ..”

ప్రపంచంలో ఎన్నో రకాల ఆకులు ఉంటాయి. కొన్ని తులసిఆకు లాగా పూజకు పనికి వస్తాయి. కొన్ని గోరింటాకు లాగా అందానికి పనికి వస్తాయి. ఇక కొన్ని అరుదైన జాతులు ఉంటాయి. ఆకులే కదా..! అని లోకువగా చూడకుండా వాటిని చూసి చూడనట్లు వదిలేయ్యాలి. ఎందుకంటే అవి ఒక ఘనకార్యం నిమిత్తం ఎర్త్ మీదకు ఎంట్రీ ఇచ్చి ఉంటాయి. అలాంటి అరుదైన ఆకులలో ఒకటి “దురదగుంటాకు”. ఇక దాని గొప్పతనం గురించి అందరికీ తెలుసు. అలాంటి దురదగుంటాకు లాంటి అరుదైన వ్యక్తి “రామ్ గోపాల్ వర్మ.” ఇక ఆర్జీవీ ఘనత అలా.. పక్కన పెడితే,

ప్రముఖ సాహిత్య రచయిత, అద్భుతమైన జ్ఞానిశ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు. ఎన్నో గొప్ప పాటలు రాసి, నిజంగానే తెలుగు సినిమా స్థాయిని పెంచిన గీత రచయిత ఆయన. ఇప్పుడు ఆయన “ఆర్జీవి” సినిమాకు దర్శాత్వం వహిస్తున్నారు. బాల కుటుంబరావు గారు నిర్మాత. సొసైటీ లో కొంతమంది స్వేఛ్చ పేరుతో జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారని, దానివల్ల కలిగే కష్ట నష్టాలు వినోదాత్మకంగా చూపిస్తున్నామని జొన్నవిత్తుల గారు తెలిపారు. గతంలో కూడా ఆయన హాస్యనటుడు ఆలీతో “సోంబేరి” అనే సినిమా చేసారు. ఇక ఇప్పుడు ఎదో గతంలో ఆయనకు ఆర్జీవితో ఉన్న గొడవల వల్ల ఇలా చెయ్యడం వల్ల, ఒక గురు స్థానంలో ఉండతగ్గ వ్యక్తిగా తనను తానే  జొన్నవిత్తుల గారు తగ్గించుకున్నట్లు అవుతుంది. ఒకరు మనలని ఎదో అన్నారని మనం స్టేబిలిటీ కోల్పోవడం కరెక్ట్ కాదు.