ఓడ్కా మీద ఒట్టు నేను బాడ్కావ్ నా…!


ఓడ్కా మీద ఒట్టు నేను బాడ్కావ్ నా...!
ఓడ్కా మీద ఒట్టు నేను బాడ్కావ్ నా…!

రామ్ గోపాల్ వ‌ర్మై ముప్పెట దాడి మొద‌లైంది. ఎప్పుడూ ఎవ‌రినో ఒక‌రిని టార్గెట్ చేస్తూ వారి వ్య‌క్తి గ‌త జీవితాన్ని బజారుకీడ్చే వ‌ర్మ ఇప్పుడు తానే బ‌జారున ప‌డే స‌మ‌యం వ‌చ్చిందా? అన్న‌ట్టుగా ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. స్టార్ హీరో, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ని టార్గెట్ చేస్తూ రామ్‌గోపాల్‌వ‌ర్మ `ప‌వ‌ర్‌స్టార్‌` పేరుతో సొంత ఓటీటీ కోసం ఓ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. దీనిపై సోష‌ల్ మీడియాలో పెద్ద చ‌ర్చ న‌డుస్తోంది.

దీనికి ప్ర‌తీకారంగా వ‌ర్మ‌ని టార్గెట్ చేస్తూ వ‌రుస‌గా సినిమాలు పుట్టుకొస్తున్నాయి. ప‌రాన్న‌జీవి, పార్న్ జీవి అంటూ సినిమాలు వ‌దులుతున్నారు. తాజాగా గేయ ర‌చ‌యిత జొన్న‌విత్తుల రామ‌లింగేశ్వ‌ర‌రావు `ఆర్జీవీ` పేరుతో ఓ సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. `రోజూ గిల్లేవాడు` అని ఈ చిత్రానికి ట్యాగ్‌లైన్ కూడా పెట్టారు. `కార్తికేయ‌` ఫేమ్ శ్రీ‌నివాస్ బొగ్గారం స‌మ‌ర్ప‌ణ‌లో బాల కుటుంబ‌రావు పొన్నూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలోని ఓ లిరిక‌ల్ వీడియోను చిత్ర బృందం శ‌నివారం విడుద‌ల చేసింది.

ఈ పాట‌లో వ‌ర్మై వున్న క‌సిని అంతా తీర్చుకున్నారు. `ఓడ్కా మీద ఒట్టు నేను బాడ్కావ్ నా కొడ్కుని.. ఈ ఓడ్కా మీదొట్టు నేన్ మూర్ఖ‌పు నా కొడ్కుని.. కొంత మందికి పిచ్చినా కొడుకుని..ఇంక‌కొంత మందికి మాయనా కొడుకుని.. మోర‌ల్సులేని మొండినాకొడుకుని… అంటూ జొన‌ర్న విత్తుల వ‌ర్మ‌పై వున్న త‌న క‌సిని తీర్చుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఈ పాట‌కు సంబంధించిన లిరిక‌ల్ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.