రెండోసారి తండ్రి అయిన ఎన్టీఆర్


jr ntr and laxmi pranathi blessed baby boy

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి తండ్రి అయ్యాడు , ఇప్పటికే అభయ్ అనే కొడుకు ఉండగా ఈరోజు ప్రణతి మరో బిడ్డకు జన్మనిచ్చింది దాంతో తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మా కుటుంబం మరింత పెద్దదయ్యింది ….. మగ బిడ్డ పుట్టాడు అంటూ ట్వీట్ చేసి నందమూరి అభిమానులను సంతోషంలో ముంచెత్తాడు ఎన్టీఆర్ . లక్ష్మీ ప్రణతిఎన్టీఆర్ లకు రెండో కొడుకు పుట్టడంతో అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి .

ఇక అన్న నందమూరి కళ్యాణ్ రామ్ సైతం ఎన్టీఆర్ దంపతులకు శుభాకాంక్షలు అందజేశాడు . తమ అభిమాన హీరో రెండోసారి తండ్రి కావడం , కొడుకు పుట్టడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు . జై లవకుశ తో హిట్ అందుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో నటిస్తున్నాడు . ఆ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .