ఫ్యాన్స్ ని నిరాశపరిచిన రాజమౌళి


Rajamouli
Rajamouli

నిన్న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్ ఆర్ ఆర్ చిత్రం నుండి ఏదైనా అప్ డేట్ ఉంటుందని భావించారు జూనియర్ ఎన్టీఆర్ , రాంచరణ్ ల ఫ్యాన్స్ కానీ వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లి అందరినీ నిరాశపరిచాడు దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి . ఆర్ ఆర్ ఆర్ చిత్రం రూపొందుతోందే దేశభక్తి అణువణువునా ఉన్న ఇద్దరు పోరాట యోధులు కొమరం భీం , అల్లూరి సీతారామరాజు జీవిత కథల పైన.

దాంతో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ఇద్దరికీ సంబందించిన ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా సర్ప్రయిజ్ ఉంటుందని అనుకున్నారు . కానీ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ హ్యాండ్ ఇచ్చాడు జక్కన్న దాంతో ఎన్టీఆర్ , చరణ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు . అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూలై 30 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.