ఎన్టీఆర్ కి కోపం తెప్పించారు


jr ntr angry with that questionయంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కోపం వచ్చింది అయితే ఆ కోపాన్ని అణుచుకుంటూ సమాధానం ఇవ్వడం ఇష్టం లేక పాత ఇంటర్వ్యూ ని ఫాలో అవ్వండి తెలుస్తుంది అని అన్నాడు . ఈ సంఘటన నిన్న జరిగింది , ఇక ఎన్టీఆర్ కు కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా …… ” ఎన్టీఆర్ బయోపిక్ లో మీరు నటించడం లేదా ? అని అడిగిన ప్రశ్న కు ఎన్టీఆర్ కు కోపం వచ్చింది . ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే . బాలయ్య ఎన్టీఆర్ పాత్రలో నటిస్తుండగా ఇతర ముఖ్య పాత్రల్లో పలువురు ప్రముఖులు నటిస్తున్నారు దాంతో వాళ్లతో పాటుగా జూనియర్ ఎన్టీఆర్ కూడా నటిస్తే బాగుండు అని అనుకుంటున్నారు పలువురు .

ఇదే ప్రశ్న ని ఎన్టీఆర్ కు వేశారు దాంతో ఇబ్బంది పడ్డాడు ఎన్టీఆర్ . ఎందుకంటే బాలయ్య బాబాయ్ అడగకుండా ఎన్టీఆర్ ఆ సినిమాలో నటించలేడు , దాని గురించి చెప్పలేడు అలాంటిది కావాలని మళ్ళీ మళ్ళీ ఎన్టీఆర్ ని ప్రశ్నించడంతో కోపానికి గురైన ఎన్టీఆర్ ఇంతకుముందు చెప్పిన సమాధానం ని చూసుకోండి అని కాస్త కోపంగానే చెప్పాడట . ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతోంది . ఇక ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో నటిస్తున్నాడు . ఎన్టీఆర్ బయోపిక్ వచ్చే ఏడాది సంక్రాంతి కి వస్తుండగా ఎన్టీఆర్ అరవింద సమెత మాత్రం దసరా కానుకగా విడుదల చేయాలనీ భావిస్తున్నారు .

English Title: jr ntr angry with that question