హైద‌రాబాద్ రోడ్ల‌పై ఎన్టీఆర్ బైక్ రైడింగ్‌!

హైద‌రాబాద్ రోడ్ల‌పై ఎన్టీఆర్ బైక్ రైడింగ్‌!
హైద‌రాబాద్ రోడ్ల‌పై ఎన్టీఆర్ బైక్ రైడింగ్‌!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌలి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ `ఆర్ఆర్ఆర్` లో  న‌టిస్తూ బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ కూడా ఈ ప్రాజెక్టులో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. త్వ‌ర‌లోనే త‌న 30వ చిత్రాన్ని స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో ప్రారంభించ‌బోతున్నారు. సుధాక‌ర్ మిక్కినేనితో క‌లిసి పంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ ఈ మూవీని నిర్మించ‌య‌బోతున్నారు.

ఇదిలా వుంటే హీరో ఎన్టీఆర్ హైద‌రాబాద్ రోడ్ల‌పై బైక్ రైడ్ చేస్తూ తాజాగా హ‌ల్ చ‌ల్ చేశారు. ఖాళీ స‌మ‌యాల్లో ఎక్కువ‌గా కుటుంబంతో గ‌డప‌డానికే అధిక ప్రాధాన్యం ఇచ్చే ఎన్టీఆర్ ఇటీవ‌ల `ఆర్ ఆర్ ఆర్‌` షూట్‌కి మ‌ధ్య బ్రేక్ ల‌భించ‌డంతో ఆ స‌మ‌యాన్ని ఫ్యామిలీకి కేటాయించేశారు. కోవిడ్ ఉగ్ర‌రూపం దాలుస్తున్న నేప‌థ్యంలో హైద‌రాబాద్ రోడ్ల‌పై ర‌ద్దీ త‌క్కువ‌గా వుండ‌టంతో త‌న త‌నయుడు భార్గ‌వ్ రామ్‌తో క‌లిసి హెల్మెట్ ధ‌రించి బైక్‌పై రైడ్‌కి వెళ్ల‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.

ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. భార్గ‌వ్ రామ్ ఎన్టీఆర్ చిన్న కుమారుడు అన్న విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్ కు ఇద్ద‌రు కుమారులు. అందులో చిన్న‌వాడు భార్గ‌వ్ రామ్‌. ఈ ఇద్ద‌రితో పాటు ఎన్టీఆర్ వెన‌కాల మ‌రో వ్య‌క్తి ముఖానికి మాస్కుతో క‌నిపిస్తున్నాడు. అత‌ను ఎవ‌ర‌న్న‌ది మాత్రం తెలియ‌రాలేదు.