జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ గా చిత్రలహరి వేడుక


Jr. NTR chief guest for Sai tej' s Chitralahari pre release event

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ అలియాస్ సాయి తేజ్ నటించిన చిత్రం ” చిత్రలహరి ”. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 12న విడుదల చేయనున్నారు . సినిమా రిలీజ్ కి ముందుగా చిత్రలహరి ప్రీ రిలీజ్ వేడుక పెద్ద ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు . కాగా ఆ వేడుకకు ముఖ్య అథితిగా జూనియర్ ఎన్టీఆర్ ని ఆహ్వానించారట ! ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా వారి ఆహ్వానాన్ని మన్నించి రావడానికి సిద్దమయ్యాడట .

 

మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో జనతా గ్యారేజ్ చేసాడు ఎన్టీఆర్ దానికి తోడు మెగా మేనల్లుడు సాయి తేజ్ కోసం అలాగే హాస్య నటుడు  సునీల్ కోసం ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనడానికి ఒప్పుకున్నాడట ఎన్టీఆర్ . ఏప్రిల్ మొదటి వారంలో చిత్రలహరి వేడుక నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు . ఇక సినిమాని ఏప్రిల్ 12న రిలీజ్ చేయనున్నారు .