ఎన్టీఆర్ టాస్క్ కంప్లీట్ .. మ‌రి ఛాలెంజ్ ఎవ‌రికి?



ఎన్టీఆర్ టాస్క్ కంప్లీట్ .. మ‌రి ఛాలెంజ్ ఎవ‌రికి?
ఎన్టీఆర్ టాస్క్ కంప్లీట్ .. మ‌రి ఛాలెంజ్ ఎవ‌రికి?

ఆదివారం ద‌ర్శ‌కుడు `అర్జున్‌రెడ్డి` ఫేమ్ సందీప్‌రెడ్డి వంగ ఇంటి ప‌ని చేసి త‌న శ్రీ‌మ‌తికి తాను సాయం చేశాన‌ని, త‌న‌లా అంతా నిజ‌మైన మ‌గాళ్లుగా వుండాల‌ని ఛాలెంజ్ చేశాడు. బీ ద రియ‌ల్ మెన్ అంటూ త‌న లాగే ఇంటి ప‌ని చేసి ఆ వీడియోని ట్విట్ట‌ర్‌లో షేర్ చేయాల‌ని రాజ‌మౌళిని ఛాలెంజ్ చేసిన విష‌యం తెలిసిందే.

దీనికి సోమ‌వారం త‌న స‌తీమ‌ణికి సాయం చేసిన రాజ‌మౌళి ఇంట్లో ఫ్లోర్ క్లీన్ చేయ‌డం తో పాటు చీపురు ప‌ట్టి ఇల్లు ఊడ్చ‌డ‌మే కాకుండా త‌న‌లా చేసి నిజ‌మైన మ‌గాళ్లు అనిపించుకోండ‌ని ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌, శోభు యార్ల‌గ‌డ్డ‌, సుకుమార్‌ల‌కు ఛాలెంజ్ విసిరి ఓ వీడియోని పోస్ట్ చేశారు జ‌క్క‌న్న‌. దీనికి ముందుగా ఎన్టీఆర్ స్పందించి ఛాలెంజ్‌కి సిద్ధం అనే సంకేతాల్ని పంపించారు.

చెప్పిన‌ట్టే మంగ‌ళ‌వారం ఉద‌యం ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ వీడియోని పోస్ట్ చేశారు. `మ‌న ఇంట్లో ప్రేమ‌లు ఆప్యాయ‌త‌లే కాదు ప‌నులు కూడా పంచుకుందాం. ప‌నిని షేర్ చేసుకోవ‌డంలో ఆనందం వుంది.  అంటూ చీపురు ప‌ట్టి ఫ్లోర్ తుడిచి, పాత్ర‌లు క్లీన్ చేసి జ‌క్క‌న్న విసిరిన  ఛాలెంజ్ ని పూర్తి చేశాడు తార‌క్.  ఓ వీడియోని పోస్ట్ చేసిన ఆయ‌న టాలీవుడ్ దిగ్గ‌జాలైన న‌లుగురు హీరోలు బాల‌కృష్ణ‌, చిరంజీవి, నాగార్జున‌, వెంక‌టేష్‌, కొర‌టాల శివ‌ల‌కు ఛాలెంజ్ విస‌ర‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

Credit: Twitter