ఎన్టీఆర్ ఓల్డ్‌మెన్ గెట‌ప్‌లో క‌నిపిస్తాడా?


ఎన్టీఆర్ ఓల్డ్‌మెన్ గెట‌ప్‌లో క‌నిపిస్తాడా?
ఎన్టీఆర్ ఓల్డ్‌మెన్ గెట‌ప్‌లో క‌నిపిస్తాడా?

తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో వున్న హైలీ టాలెంటెడ్ హీరోల్లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌. అన‌ర్గ‌ళంగా సింగిల్ టేక్‌లో డైలాగ్ లు చెప్పి ఆశ్చ‌ర్యానికి గురిచేయ‌గ‌ల టాలెంట్ ఎన్టీఆర్ సొంతం.. ఎలాంటి పాత్ర‌లో అయినా అద్భుత‌మైన అభిన‌యాన్ని ప్ర‌ద‌ర్శించ‌డంలోనూ ఎన్టీఆర్ త‌రువాతే ఎవ‌రైనా. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ `ఆర్ ఆర్ ఆర్‌`లో గోండు బెబ్బులి కొమ‌రం భీం పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న విష‌యం తెలిసిందే.

రామ్‌చ‌ర‌ణ్ మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో న‌టిస్తున్నారు. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ మూవీ చివ‌రి షెడ్యూల్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. ఇందులో ఇద్ద‌రి పాత్ర‌ల‌కు సంబంధించిన టీజ‌ర్‌లు ఇటీవ‌ల విడుద‌లైన విష‌యం తెలిసిందే. అయితే ఈ మూవీలో ఎన్టీఆర్ ఓల్డ్ మెన్ గెట‌ప్‌లో క‌నిపిస్తాడ‌ని తెలుస్తోంది. ఈ గెట‌ప్ అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురిచేయ‌నుంద‌ని స‌న్నిహిత వ‌ర్గాల స‌మాచారం.

ఈ మూవీలో రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ పాత్ర‌లు స‌మానంగా వుంటాయ‌ని ఎవిర పాత్ర‌కున్న ప్రాధాన్య‌త వారికి వుంటుంద‌ని చెబుతున్నారు. అయితే ర‌న్ టైమ్ ఎంత అన్న విష‌యంలో మాత్రం క్లారిటీ లేదు. కొమ‌రం భీం పాత్ర కోసం ఎన్టీఆర్ తెలంగాణ యాస‌ని నేర్చుకుని డ‌బ్బింగ్ చెప్పిన తీరు ఇప్ప‌టికే ఆక‌ట్టుకుంటోంది. రేపు సినిమాలో ఎలా వుంటుందా? అని ఫ్యాన్స్ అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.