సంచలనం సృష్టిస్తున్న ఎన్టీఆర్ పోస్టర్


Jr. NTR fan made poster creates sensation
Jr. NTR fan made poster creates sensation

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సంచలనం సృష్టిస్తోంది. ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ లుక్ ఇదే అంటూ ఓ పోస్టర్ వైరల్ అవుతోంది . అయితే ఆ పోస్టర్ ఆర్ ఆర్ ఆర్ చిత్ర బృందం రిలీజ్ చేసిన పోస్టర్ కాదు సుమా ! ఓ అభిమాని తన క్రియేటివిటీ తో చేసిన పోస్టర్ . అయితే ఈ పోస్టర్ అద్భుతంగా ఉంది ఎందుకంటే ఎన్టీఆర్ లోని రోషం , ధైర్యం కలగలిపి ఉంది మరి .

తలపాగా చుట్టి , కొద్దిగా పెరిగిన గడ్డం , అలాగే కోర మీసంతో అచ్చం కొమరం భీం లా ఉన్నాడు , పైగా ఇది నిజమైన పోస్టర్ ని తలపించేలా ఉంది . దాంతో ఈ పోస్టర్ వైరల్ అవుతోంది . ఎన్టీఆర్ కు అలాగే చరణ్ కు గాయాలు కావడంతో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి వాయిదావేయాల్సిన అవసరం వచ్చింది . మళ్ళీ నెలలోనే ఆర్ ఆర్ ఆర్ సెట్స్ మీదకు వెళ్లనుంది . రాజమౌళి దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే .