ఎన్టీఆర్ ని అవమానించాడని బూతులు తిడుతున్నారు


jr ntr fans fires on aadarsh balakrishna

నెగెటివ్ పాత్రలు పోషించే ఆదర్శ్ బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ని అవమానించాడని అతడ్ని బూతులు తిడుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ . తాజాగా ఆదర్శ్ బాలకృష్ణ కు ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో ఛాన్స్ ఇచ్చారు . నిన్న ఆదివారం రోజున షూటింగ్ లో పాల్గొన్నాడు ఆదర్శ్ బాలకృష్ణ . నా కల నిజమైందని త్రివిక్రమ్ సార్ దర్శకత్వంలో నటించే అదృష్టం దొరికిందని ట్వీట్ చేసాడు అయితే అదే ట్వీట్ లో ఎన్టీఆర్ ని జూనియర్ ఎన్టీఆర్ అని మాత్రమే సంబోదించగా త్రివిక్రమ్ ని మాత్రం సర్ అని సంబోదించాడు ఆదర్శ్ బాలకృష్ణ .

అంతే ! జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఎక్కడా లేని కోపం వచ్చింది ఆదర్శ్ బాలకృష్ణ పై , జూనియర్ ఎన్టీఆర్ అని ఏకవచనం తో సంబోదిస్తావా ? ఎన్టీఆర్ ని అన్నా అని అను లేకపోతే సార్ అని అను అంతేకాని జూనియర్ ఎన్టీఆర్ అని అంటావా అంటూ ఆదర్శ్ బాలకృష్ణ ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు . కొంతమంది ఫ్యాన్స్ అయితే రెచ్చిపోయి బూతులు కూడా తిడుతున్నారు ఈ నటుడిని . తెలుగులో నెగెటివ్ పాత్రలు పోషిస్తూ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు ఆదర్శ్ బాలకృష్ణ . ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమాలో ఛాన్స్ రావడంతో బ్రేక్ వస్తుందని ఆశిస్తున్నాడు కట్ చేస్తే బ్రేక్ సంగతి దేవుడెరుగు కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేతిలో మాత్రం తిట్లు తింటున్నాడు .

English Title: jr ntr fans fires on aadarsh balakrishna