ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతలా ఫీల్ అవ్వాల్సిన పనేముంది?


Jr NTR fans upset with heroine selection for RRR
Jr NTR fans upset with heroine selection for RRR

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న భారీ మల్టీస్టారర్ ఆర్ ఆర్ ఆర్ లో సస్పెన్స్ లకు తెరపడింది. గత ఆరేడు నెలలుగా ఎన్టీఆర్ సరసన హీరోయిన్ ఎవరా అన్న చర్చకు మొత్తానికి ఫుల్ స్టాప్ పడింది. మొదట ఎన్టీఆర్ పోషిస్తున్న కొమరం భీమ్ పాత్రకు జోడిగా విదేశీ భామ డైసీ ఎడ్గార్ జోన్స్ ను తీసుకున్న విషయం తెల్సిందే. అయితే కారణాలు తెలీదు కానీ ఆ భామ తాను సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించిన కొన్ని రోజులకే సినిమా నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఇది జరిగి దాదాపు ఏడు నెలలు అవుతోంది. అప్పటినుండి ఎన్టీఆర్ సరసన హీరోయిన్ కోసం వేట కొనసాగుతూనే ఉంది.

అయితే ఎట్టకేలకు ఈ చిత్రంలో హీరోయిన్ ఎంపిక పూర్తై నిన్ననే ప్రకటించారు కూడా. ఒలీవియా మోరిస్ అని బ్రిటన్ కు చెందిన స్టేజి ఆర్టిస్ట్ ను హీరోయిన్ రోల్ కోసం ఎంపిక చేసారు ఈ భామ చూడటానికి అందంగానే ఉంది. మంచి పెర్ఫార్మర్ అని కూడా అంటున్నారు. అయినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ హీరోయిన్ ఎంపిక పట్ల ఒకింత అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం నిన్న ఒలీవియాను తీసుకుంటున్నట్లు వార్త వచ్చాక తన గురించి గూగుల్ లో సెర్చ్ చేయడం మొదలెట్టారు చాలా మంది. గూగుల్ లో టాప్ సెకండ్ సెర్చ్డ్ సెలబ్రిటీగా కూడా ఒలీవియా నిలిచింది. అయినా ఎందుకు అసంతృప్తి అంటే సెర్చ్ చేస్తున్నప్పుడు తెలిసిన విషయం.. ఒలీవియాకు కనీసం వికీపీడియా పేజీ కూడా లేకపోవడం. ఈరోజుల్లో చిన్న చిన్న హీరోయిన్లకు కూడా వికీపీడియా పేజీలు ఉంటున్నాయి. అలాంటిది కనీసం వికీపీడియా పేజీ కూడా లేని హీరోయిన్ ను ఎన్టీఆర్ పక్కన సెట్ చేయడమేంటి అని ఫీల్ అవుతున్నారు.

దీనికి తగ్గట్లే యాంటీ ఫ్యాన్స్ కూడా రామ్ చరణ్ కేమో అలియా భట్ వంటి టాప్ స్టార్ ను సెట్ చేసి, ఎన్టీఆర్ కు ఎలాంటి హీరోయిన్ ను ఇచ్చారో అంటూ ఫ్యాన్స్ ను గిచ్చుతున్నారు. అయితే నిజంగా ఫ్యాన్స్ అంతలా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉందా అన్నది చూసుకోవాలి. ఎన్టీఆర్ అంటే రాజమౌళికి ప్రత్యేకమైన అభిమానం. అందరికంటే ఎక్కువగా తారక్ తోనే మూడు సినిమాలకు పనిచేసాడు రాజమౌళి. ఆర్ ఆర్ ఆర్ నాలుగో సినిమా. చాలా వేదికలపై తన దృష్టిలో ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్ అని కూడా నిర్మొహమాటంగా చెప్పాడు. మరి ఇంత అభిమానమున్న రాజమౌళి, ఎన్టీఆర్ విషయంలో కావాలని ఏదైనా నెగటివ్ గా చేస్తాడని అనుకోలేం.

కాబట్టి ఫ్యాన్స్ ఈ విషయంలో అంతలా బాధపడాల్సింది ఏం లేదు. కథ ప్రకారం ఎన్టీఆర్ కు విదేశీ భామ కావాలి కాబట్టి అన్నీ కుదిరేలా ఇలా చేసుండొచ్చు. అయినా ఎన్టీఆర్ కు ఎన్ని ఎలివేషన్స్ ఇస్తాడో, సినిమాను ఎంత పెద్ద హిట్ చేస్తాడో అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆలోచించుకోవాలి కానీ ఎన్టీఆర్ పక్కన ఏ హీరోయిన్ అయితే ఏముంది. ఎవరైనా దృష్టాంతా ఎన్టీఆర్ పెర్ఫార్మన్స్ మీదే ఉంటుందిగా. సో, చింతించకుండా ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేయండి.