ఎన్టీఆర్ కు వెల్లువలా బర్త్ డే గ్రీటింగ్స్


ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో బర్త్ డే గ్రీటింగ్స్ తో హోరెత్తిపోతోంది . ఇక తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఇంటి ముందు పెద్ద సంఖ్యలో ఎన్టీఆర్ అభిమానులు వేచి ఉన్నారు . పుట్టినరోజు జరుపుకోవడం లేదు అలాగే మీరు కూడా పుట్టినరోజు వేడుకలు ఎక్కడా చేయొద్దు అని ఎన్టీఆర్ చెప్పినప్పటికీ తమ అభిమాన హీరోని చూడాలని హైదరాబాద్ కు పెద్ద ఎత్తున చేరుకున్నారు ఎన్టీఆర్ అభిమానులు .

దాంతో జూనియర్ ఎన్టీఆర్ ఇంటి ముందు ట్రాఫిక్ సమస్య ఏర్పడింది పొద్దు పొద్దున్నే ! పుట్టినరోజు నాడు ఎన్టీఆర్ బయటకు వస్తాడు , చూస్తాడు పలకరిస్తారు అంటూ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు . ఎన్టీఆర్ అభిమానుల కోలాహలంతో ఎన్టీఆర్ పరిసరాలలో సందడి నెలకొంది . ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే . ఇక పలువురు సినీ ప్రముఖులు కూడా ఎన్టీఆర్ పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు .