ఎన్టీఆర్ కోసం బ్రిటిష్ భామ


Jr Ntr
Jr Ntr

ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ సరసన నటించే భామ కోసం ఓ బ్రిటిష్ భామని ఎంపిక చేశారట దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి . అయితే ఆమె పేరు మాత్రం బయటకు పొక్కకుండా చాలా జాగ్రత్తలు పడ్డాడు . ఎందుకంటే డైసీ ఎడ్గార్ జోన్స్ ని అనుకుంటే చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చింది , ఆ తర్వాత మరో భామ ని అనుకుంటే ఆ హాలీవుడ్ భామ కూడా హ్యాండ్ ఇచ్చింది దాంతో ఇప్పుడు ఎంపిక చేసిన హీరోయిన్ పేరు బయటకు రాకుండా గట్టి ఆదేశాలు జారీ చేసాడట .

చరణ్ కోసం అలియా భట్ ని ఎంపిక చేసారు, అయితే ఎన్టీఆర్ సరసన నటించే భామ కోసం యుద్ధమే జరుగుతోంది . ఆమె కోసం జక్కన్న జల్లెడ పట్టాడు . మొత్తానికి హీరోయిన్ ఫిక్స్ కావడంతో త్వరలోనే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ సెట్స్ మీదకు వెళ్లనుందని తెలుస్తోంది . ఇక ఈ చిత్రాన్ని 2020 జూలై లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . అల్లూరి సీతారామరాజు గా చరణ్ నటిస్తుండగా ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్నాడు