ఎన్టీఆర్ బయోపిక్ లో జూనియర్ ఎన్టీఆర్


Jr ntr in NTR biopicఎన్టీఆర్ బయోపిక్ లో జూనియర్ ఎన్టీఆర్ కూడా నటిస్తే బాగుండు అని చాలామంది అనుకున్నారు , బలంగా కోరుకున్నారు అందుకే కాబోలు అందరి కోరిక బలీయంగా ఉండబట్టే ఎన్టీఆర్ బయోపిక్ లో జూనియర్ ఎన్టీఆర్ కనిపించడం ఖాయమని అంటున్నారు . మహానటుడు ఎన్టీఆర్ పాత్రలో నందమూరి బాలకృష్ణ నటిస్తుండగా ఇప్పటికే హరికృష్ణ పాత్రలో నందమూరి కళ్యాణ్ రామ్ నటించనున్నాడు అయితే జూనియర్ ఎన్టీఆర్ ఏ పాత్రలో కనిపించనున్నాడు అన్నది మాత్రం రివీల్ చేయలేదు కానీ ఎన్టీఆర్ బయోపిక్ లో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తే ఆ కిక్కే వేరు .

ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ కు ఎనలేని క్రేజ్ వచ్చింది , బిజినెస్ వర్గాల్లో కూడా సంచలనం సృష్టిస్తోంది . ఇక ఆ క్రేజ్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తోడైతే రికార్డుల మోత మోగడం ఖాయం . పలువురు ప్రముఖ నటీనటులు ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తున్నారు , అయితే ఎన్టీఆర్ కు మిగతా వాళ్లకు తేడా ఉంది కాబట్టి జూనియర్ ఉంటే ఆ కిక్కే వేరు . క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 9న విడుదల చేయాలనీ బాలయ్య కంకణం కట్టుకున్నాడు . బాలయ్య – ఎన్టీఆర్ ల మధ్య బేధాభిప్రాయాలు ఉన్నాయి కానీ ఈ ఇద్దరూ ఒకటైతే నందమూరి అభిమానులకు పండగే పండగ .

English Title : Jr ntr in NTR biopic