ఆ సినిమాకు ఎన్టీఆరే దిక్కా ?


Jr Ntr
Jr Ntr

అగ్ర నిర్మాత అల్లు అరవింద్ రామాయణం చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించడానికి సిద్దమయ్యాడు . దాదాపు 1500 కోట్ల భారీ బడ్జెట్ తో మల్టీ లాంగ్వేజెస్ ఫిలిం గా తెరకెక్కనున్న చిత్రంలో రాముడు ఎవరు అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది . రాముడు అనగానే నందమూరి ఫ్యామిలీ గుర్తుకురావడం ఖాయం . ఇక ఇప్పుడు రాముడు అంటే జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే !

భారీ బడ్జెట్ రికవరీ కావాలంటే జూనియర్ ఎన్టీఆర్ అయితేనే సాధ్యం , అయితే రామాయణం అని ప్రకటించారు కానీ అందులో నటీనటుల సంగతి ప్రకటించలేదు . అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే దిక్కు అన్నట్లుగా తెలుస్తోంది . ఎన్టీఆర్ రాముడిగా సరిగ్గా సరిపోతాడు పైగా బిజినెస్ దృష్ట్యా కూడా ఎన్టీఆర్ సరైనోడు . అయితే ఇది ఎన్టీఆర్ తోనే చేస్తారా ? లేక మరో హీరోని తీసుకుంటారా ? అన్నది చర్చగా మారింది . అయితే అల్లు అరవింద్ ఆలోచన ఎలా ఉందో మరి .