అమ్మకోసం జూనియర్ ఎన్టీఆర్


నిత్యం షూటింగ్ లతో బిజీ గా ఉండే జూనియర్ ఎన్టీఆర్ ఎలాగైనా సరే అమ్మ సంతోషం కోసం కొంత సమయం కేటాయించాలని అనుకున్నాడట ! అయితే ఇలా ఎన్నిసార్లు అనుకున్నా కుదరకపోవడంతో అది వాయిదాపడుతూనే వచ్చింది . అయితే అమ్మకోసం ఎలాగైనాసరే ఈసారి తీరిక చేసుకోవాలని భావించిన ఎన్టీఆర్ మాతృదినోత్సవం కంటే ముందే తన తల్లికి సంతోషాన్ని పంచాడు .

జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలిని అన్న విషయం తెలిసిందే . అయితే ఆమె తరుపు బంధువులు అంతగా సినిమావాళ్ళకు తెలియదు . కానీ తన మాతృమూర్తి కోసం ఆమె బంధువుల ఇళ్లలోకి వెళ్లి ఆశ్చర్యానికి గురిచేశాడు ఎన్టీఆర్ . జూనియర్ ఎన్టీఆర్ తన తల్లి భార్య , పిల్లలతో కలిసి తల్లి బంధువుల ఇళ్లలోకి వెళ్లడంతో వాళ్ళ సంతోషానికి అవధులే లేకుండాపోయాయి . అంతేనా తల్లి షాలిని అయితే పరమానందభరితురాలయ్యింది . ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ గ్యాప్ రావడంతో ఇలా జూనియర్ తన తల్లి కోసం కర్ణాటక టూర్ ప్లాన్ చేసాడు అన్నమాట . జూనియర్ ఎన్టీఆర్ తన బంధుమిత్రులతో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .