వైరల్ గా మారిన ఎన్టీఆర్ వీడియో

Jr ntr
Jr ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . కొమరం భీం గా ఎన్టీఆర్ నటిస్తుండగా రాంచరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నాడు . కొమరం భీం పాత్ర అంటే తప్పకుండా గుర్రాలతో సావాసం చేసే పాత్ర కావడంతో ఓ గుర్రాన్ని ఎన్టీఆర్ మచ్చిక చేసుకుంటున్న తరుణంలో తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

ఆల్రెడీ రాంచరణ్ కు గుర్రాలతో మంచి స్నేహం ఉంది , స్వారీ లో మంచి పట్టు కూడా ఉంది . ఎందుకంటే చరణ్ చిన్నప్పటి నుండే గుర్రాల స్వారీ నేర్చుకున్నాడు . అయితే ఎన్టీఆర్ కు మాత్రం కొత్తే అని చెప్పాలి దాంతో గుర్రాన్ని మచ్చిక చేసుకునే పనిలో పడ్డాడు . ఆర్ ఆర్ ఆర్ లో గుర్రపు స్వారీ సీన్లు బోలెడు అందుకే ఎన్టీఆర్ కష్టపడుతున్నాడు పాపం