ఎన్టీఆర్ రిజెక్ట్ చేస్తే విజయ్ దేవరకొండ ఓకే చేసాడటJr NTR and Vijay Deverakonda Fighter
Jr NTR and Vijay Deverakonda Fighter

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం ఫైటర్ కథ రాసాడట దర్శకులు పూరి జగన్నాధ్ , అయితే ఎన్టీఆర్ కు కథ చెప్పాడు కానీ అది ఎక్కడో ఎన్టీఆర్ కు నచ్చలేదట ! దాంతో ఎన్టీఆర్ మొహమాటం లేకుండా రిజెక్ట్ చేసాడట దాంతో అదే కథలో కొన్ని మార్పులు చేసి విజయ్ దేవరకొండ కు చెప్పగా నచ్చడంతో వెంటనే ఒప్పేసుకున్నాడు దాంతో పూరి జగన్నాధ్ – విజయ్ దేవరకొండ ల కాంబినేషన్ లో ఫైటర్ సిద్ధమైంది .

నవంబర్ లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది . ఇక ఎన్టీఆర్ – పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో టెంపర్ వంటి సూపర్ హిట్ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే . దాంతో మళ్ళీ ఎన్టీఆర్ తో సినిమా చేయాలనుకున్నాడు కానీ ఎన్టీఆర్ మాత్రం నో చెప్పాడు పైగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో ఉన్నాడు కాబట్టి ఇప్పట్లో వీలు అయ్యేది కూడా కాదు . డియర్ కామ్రేడ్ ప్లాప్ తో సతమతం అవుతున్న విజయ్ దేవరకొండ కు సరైన సమయంలో ఫైటర్ కథ చెప్పడం అది నచ్చడం జరిగిపోయింది .