జూనియర్ ఎన్టీఆర్ రెండో కొడుకు పేరు ఇదే


jr. ntr reveals the name of his younger son

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఇటీవలే రెండో కొడుకు పుట్టిన విషయం తెలిసిందే . కాగా ఈరోజు ఆ రెండో కొడుక్కి నామకరణం చేసారు ఇంతకీ ఎన్టీఆర్లక్ష్మీ ప్రణతి ల రెండో కొడుకు పేరు ఏంటో తెలుసా …….. ” భార్గవ రామ్ ” . మొదటి కొడుకు పేరు ” అభయ్ రామ్ ” కాగా రెండో కొడుక్కి భార్గవ రామ్ అని పెట్టడం విశేషం . రెండు పేర్లలో కూడా తాతయ్య పేరు వచ్చేలా చూసుకొని మరీ పెట్టాడు ఎన్టీఆర్ . ఈరోజు నామకరణం కావడంతో తన ఇద్దరు పిల్లలు , భార్య లక్ష్మీ ప్రణతి తో కలిసి దిగిన ఫోటో ని ట్వీట్ చేసాడు ఎన్టీఆర్ . ఇప్పుడా ఫోటో నెట్ లో వైరల్ అవ్వడం ఖాయం .

ఎన్టీఆర్ రెండో తనయుడి విశేషాలతో ఈరోజు నందమూరి తారకరామారావు ఇంట సందడే సందడి . నాన్నకు ప్రేమతో చిత్రంలో నటిస్తున్న సమయంలో మొదటిసారిగా తండ్రి అయ్యాడు ఎన్టీఆర్ , కాగా ఇప్పుడు అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో నటిస్తున్న సమయంలో రెండో కొడుకు పుట్టాడు . ఇద్దరు రామ్ లతో ఎన్టీఆర్ తెగ ఖుషీ అవుతున్నాడు .

ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో నటిస్తున్నాడు . ఆ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు కాగా తాజా వార్తతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ అవ్వడం ఖాయం .

English Title: jr. ntr reveals the name of his younger son

The little one is, #BhargavaRam #NamingCeremony #FamilyTime #Bratpack

A post shared by Jr NTR (@jrntr) on