ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ పాత్ర ఏంటో తెలుసా


jr Ntr role revealed in ss rajamoulis RRR film

ఆర్ ఆర్ ఆర్ వర్కింగ్ టైటిల్ తో ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి రూపొందించనున్న విషయం తెలిసిందే . ఎన్టీఆర్రాంచరణ్ ల క్రేజీ కాంబినేషన్ లో ఈ చిత్రం రూపొందుతోంది దాంతో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు స్కై లెవల్లో ఏర్పడ్డాయి . అసలే బాహుబలి చిత్రాల తర్వాత జక్కన్న దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కావడంతో ఈ సినిమా అప్పుడే ప్రకంపనలు సృష్టిస్తోంది . ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఏ పాత్ర పోషించనున్నాడో తెలుసా …….

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ స్వాతంత్య్ర సమరయోధుడి పాత్రలో కనిపించనున్నాడట ! ఫ్రీడమ్ ఫైటర్ గా ఎన్టీఆర్ నటవిశ్వరూపం చూడొచ్చని , ఆ పాత్రలో ఎన్టీఆర్ చెప్పే డైలాగ్స్ కి , చేసే పోరాటానికి థియేటర్ లలో విజిల్స్ తో దద్దరిల్లిపోవడం ఖాయమని ఆ చిత్ర బృందం నుండి గుసగుసలు వినిపిస్తున్నాయి . ఈ సినిమా కథ స్వాతంత్య్ర పోరాటం నేపథ్యంలో అలాగే ఇప్పటి పరిస్థితుల నేపథ్యం కూడా ఉంటుందని సమాచారం . ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఎన్టీఆర్ ఫ్రీడమ్ ఫైటర్ గా అదరగొట్టడం ఖాయమని ఆ చిత్ర బృందం ధీమాగా ఉన్నారట . ఇంతకుముందు ఎన్టీఆర్ తో జక్కన్న చేసిన మూడు చిత్రాలు బ్లాక్ బస్టర్ లు కాగా చరణ్ తో చేసిన మగధీర పాత రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త రికార్డులు సృష్టించింది . ఇక ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి చేసే సినిమా ఎంత సంచలనం సృష్టిస్తుందో తెలియాలంటే 2020 వరకు ఎదురు చూడాల్సిందే .

English Title: jr Ntr role revealed in ss rajamoulis RRR film