జూనియర్ ఎన్టీఆర్ కు హీరోయిన్ గండం ?


జూనియర్ ఎన్టీఆర్ కు హీరోయిన్ దొరకడం లేదు . జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరో అందునా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే సినిమా అయినా హీరోయిన్ గండం తప్పడం లేదు ఎన్టీఆర్ కు . ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటించే ఛాన్స్ అంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేసి నటించాలి కానీ ఒప్పుకున్న డైసీ ఎడ్గర్ జోన్స్ తప్పుకుంది . దాంతో హీరోయిన్ ల వేటలో పడ్డాడు ఎస్ ఎస్ రాజమౌళి .

ప్రభాస్ సరసన సాహూ చిత్రంలో నటిస్తున్న బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ ని హీరోయిన్ గా ఎంపిక చేయాలనీ ఫిక్స్ అయి సంప్రదించారట కానీ ఆమె మాత్రం డేట్స్ ఖాళీ లేవు లేదంటే తప్పకుండా చేసేదాన్ని అంటూ ముక్తాయింపు ఇచ్చిందట ! ఇంకేముంది మళ్ళీ హీరోయిన్ వేటలో పడ్డాడు రాజమౌళి . పలువురు పేర్లని పరిశీలించినప్పటికీ ఏది కూడా సెట్ కాకపోవడంతో హీరోయిన్ గండం ఉందని అందుకే ఇలా జరుగుతోందని అంటున్నారు . హీరోయిన్ దొరికితేనే ఆర్ ఆర్ ఆర్ సెట్స్ మీదకు వెళ్ళేది ! మరి ఆ భామ ఎవరో ? ఎక్కడ ఉందో ?