జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడు


Jr NTR special guest for NTR biopic

రేపు ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుక ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీ ఎత్తున హైదరాబాద్ లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే . అయితే ఈ వేడుకకు అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా ? అతడ్ని బాలయ్య బాబాయ్ ఆహ్వానించాడా ? అన్న అనుమానం ఉండేది కానీ ఆ అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ కూడా వస్తున్నట్లు ప్రకటించారు ఎన్టీఆర్ బయోపిక్ బృందం .

గతకొంత కాలంగా బాలయ్య బాబాయ్ – అబ్బాయ్ ఎన్టీఆర్ ల మధ్య దూరం ఉండేది కానీ హరికృష్ణ మరణంతో నందమూరి కుటుంబం ఒక్కటయ్యింది . ఇక ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ నటించే అవకాశం ఉందని కూడా అన్నారు కానీ అది జరగలేదు కానీ వాయిస్ ఓవర్ ఇవ్వొచ్చు అని తెలుస్తోంది . రేపు జరిగే ఎన్టీఆర్ కథానాయకుడు ఆడియో వేడుకకు బాలయ్యకు అండగా కళ్యాణ్ రామ్ , ఎన్టీఆర్ లు వస్తుండటంతో నందమూరి అభిమానుల సంతోషానికి అంతే ఉండదు . నందమూరి అభిమానులు సంతోషంలో మునిగి తేలడం ఖాయం .

English Title: Jr NTR special guest for NTR biopic