ఎన్టీఆర్ టెంపర్ అక్కడ హిట్ అవుతుందా ?


Jr. ntr temper tamil remake gets release date

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే . కాగా ఆ చిత్రాన్ని ఇన్నాళ్లకు తమిళంలో రీమేక్ చేసారు . హీరో విశాల్ నటించిన ఈ చిత్రంలో రాశి ఖన్నా నటించింది . అయోగ్య పేరుతో తెరెకెక్కిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 19 న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ప్లాప్ లతో సతమతం అవుతున్న ఎన్టీఆర్ కు టెంపర్ మంచి బ్రేక్ నిచ్చింది 2015 లో .

 

తెలుగులో మంచి హిట్ కావడంతో హిందీలో సింబా గా రీమేక్ చేసారు , అక్కడ కూడా సూపర్ హిట్టే అయ్యింది . దాంతో ఇప్పుడు తమిళ రీమేక్ పై అంచనాలు పెరిగాయి . ఇటీవలే రిలీజ్ అయిన అయోగ్య టీజర్ తో అంచనాలు స్కై లెవల్లో ఏర్పడ్డాయి . ఏప్రిల్ 19 న రిలీజ్ కానున్న ఈ చిత్రం తమిళంలో కూడా హిట్ అవుతుందా ? అన్న ఆసక్తి మొదలయ్యింది . ఎన్టీఆర్ కెరీర్ ని మళ్ళీ గాడిలో పెట్టిన టెంపర్ విశాల్ కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో తెలియాలంటే ఏప్రిల్ 19 వరకు ఎదురు చూడాల్సిందే .

English Title : Jr. ntr temper tamil remake gets release date