బాలయ్య తప్పుడు స్పీచ్ తో ఎన్టీఆర్ ఇబ్బంది


Jr NTR tries to correct Balakrishna's mistake

బాలయ్య బాబాయ్ తప్పుడు స్పీచ్ తో అబ్బాయిలు నందమూరి కళ్యాణ్ రామ్ , ఎన్టీఆర్ లు తెగ ఇబ్బంది పడ్డారు . ఒకదశలో అన్నాదమ్ముల ఇద్దరూ వచ్చి బాలయ్య బాబాయ్ తప్పు ని సరిచేయడానికి ప్రయత్నించారు కానీ బాలయ్య జోరు ని ఆపేదెవరు ? ఆయన మాత్రం పట్టించుకోకుండా యధాలాపంగా మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేసాడు . ఇప్పుడు బాలయ్య తప్పు సోషల్ మీడియాలో మరోసారి ట్రెండ్ అయ్యేలా ఉంది .

 

నిన్న నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ” 118 ” చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో జరిగింది , ఆ వేడుకకు ముఖ్య అతిథులుగా బాలకృష్ణ తో పాటుగా ఎన్టీఆర్ కూడా వచ్చాడు . అయితే బాలయ్య మాట్లాడుతూ సినిమా టైటిల్ ని తప్పుగా మాట్లాడాడు . 118 కి బదులుగా 189 అంటూ మూడుసార్లు అన్నాడు . ఈ దశలో కళ్యాణ్ రామ్ , ఎన్టీఆర్ లు వచ్చి బాలయ్య బాబాయ్ కి 189 కాదు 118 అని చెప్పినప్పటికీ బాలయ్య మాత్రం ”హే బుల్ బుల్ ” అంటూ తప్పుగానే మాట్లాడాడు . దాంతో పాపం అబ్బాయిలు కూడా ఏమి చేయలేక ఉండిపోయారు .

English Title :  Jr NTR tries to correct Balakrishna’s mistake

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Director Kodi ramakrishna died35 Lakhs Fine to Mahesh babu AMB


Kani Kusruti faced sexual harrasmentSri Reddy: Koratala Siva is the boss of KamasutraMalika Arora revealed her divorce