తారక్ – త్రివిక్రమ్ సినిమాపై స్పెషల్ అప్డేట్స్ ఇవే!


తారక్ - త్రివిక్రమ్ సినిమాపై స్పెషల్ అప్డేట్స్ ఇవే!
తారక్ – త్రివిక్రమ్ సినిమాపై స్పెషల్ అప్డేట్స్ ఇవే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమాను ఓకే చేసిన విషయం తెల్సిందే. దీనికి అయినను పోయి రావాలె హస్తినకు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. అసలైతే ఈ సినిమా ఇప్పటికే మొదలవ్వాలి కానీ అనుకోకుండా వచ్చిన కరోనా వైరస్ వల్ల ఈ చిత్రం ఇప్పుడు వాయిదా పడింది. వచ్చే ఏడాది సమ్మర్ కు కానీ ఈ చిత్రం మొదలయ్యే అవకాశాలు కనిపించట్లేదు.

ఈ సినిమాకు సంబంధించిన తాజా సమాచారం ప్రకారం ఇందులో ఎన్టీఆర్ ఎన్నారై పాత్రలో కనిపిస్తాడట. ఈ విషయంలో కొంత మంది కేవలం రూమర్లే అని అనుకున్నా కానీ అదే నిజమని తెలుస్తోంది. ఇప్పటివరకూ ఇండియాకు రాని ఒక ఎన్నారై యువకుడు కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల ఇండియాకు వచ్చి ఎదుర్కొన్న సమస్యలు, దాన్నుండి అతను ఎలా బయటపడ్డాడు అన్న కోణంలో సినిమా సాగుతుందని తెలుస్తోంది.

ఇక త్రివిక్రమ్ సినిమా అంటే గుర్తిండిపోయేలా ఒక సాలిడ్ ఫీమేల్ పాత్ర ఉంటుంది. అత్తారింటికి దారేదిలో నదియా, అల వైకుంఠపురములో చిత్రంలో టబు తరహాలో ఈసారి అయినను పోయి రావాలె హస్తినకు చిత్రంలో రమ్యకృష్ణకు అలాంటి పాత్రను ఆఫర్ చేసాడట త్రివిక్రమ్.