ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే సంచలనమేనట !Jr-Ntr
Jr-Ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించడం ఖాయమని అంటున్నాడు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి . జూనియర్ ఎన్టీఆర్ కనుక రాజకీయాల్లోకి రావాలని డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అవుతుందని రాజకీయంగా ఉన్నత పదవులు పొందే యోగం జూనియర్ ఎన్టీఆర్ కు ఉందని అంటున్నాడు . అంతేనా తాత ఎన్టీఆర్ లాగే జూనియర్ కూడా రాజకీయాల్లో విప్లవం తీసుకొస్తాడని చెబుతున్నాడు .

జాతక రీత్యా ఇవి నేను చెబుతున్నానని , పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చే ముందు చాలా స్పష్టంగా రాజకీయాలు అంతగా కలిసి రావని చెప్పానని అదే ఇప్పుడు నిజమయ్యిందని …… ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెబుతున్నానని తప్పకుండా జరిగి తీరుతుందని సవాల్ చేస్తున్నాడు . అయితే ఎన్టీఆర్ కు రాజకీయాల మీద ఆసక్తి లేదు ప్రస్తుతానికి సినిమాల పైనే తన దృష్టి అంతా !