ఎన్టీఆర్30కి కూడా త్రివిక్రమ్ ఆ సెంటిమెంట్ ను కొనసాగిస్తున్నాడుగా


ఎన్టీఆర్30కి కూడా త్రివిక్రమ్ ఆ సెంటిమెంట్ ను కొనసాగిస్తున్నాడుగా
ఎన్టీఆర్30కి కూడా త్రివిక్రమ్ ఆ సెంటిమెంట్ ను కొనసాగిస్తున్నాడుగా

త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ టాప్ దర్శకులలో ప్రధమ స్థానంలో ఉంటాడు. అజ్ఞాతవాసి పరాజయం తర్వాత అరవింద సమేత చిత్రంతో బౌన్స్ బ్యాక్ అయినా కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ మునుపటిలా ఎంటర్టైనెర్స్ ను హ్యాండిల్ చేయగలడా అన్న సందేహాలు అందరిలో కలిగాయి. అయితే వాటికి అల వైకుంఠపురములో చిత్రంతో సరైన సమాధానమిచ్చాడు త్రివిక్రమ్. ఈ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరీర్ లో భారీ హిట్. అటు అల్లు అర్జున్ కెరీర్ లో కూడా హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచింది. టాలీవుడ్ చరిత్రలో బాహుబలి 2 తప్పించి మిగతా అన్ని రికార్డులను ఈ సినిమా ఎగరేసుకుపోవడం విశేషం.

అల వైకుంఠపురములో తర్వాత ఎక్కువ ఆలస్యం చేయకుండా తన తర్వాతి సినిమాను కన్ఫర్మ్ చేసాడు త్రివిక్రమ్, ఎన్టీఆర్ తో తన నెక్స్ట్ మూవీ ఉంటుందని ప్రకటించాడు. అరవింద సమేతతో ఎన్టీఆర్ తో కలిసి పనిచేసాడు. అయితే అది ఎక్కువగా సీరియస్ గా సాగే సినిమా. కానీ ఈసారి ఎన్టీఆర్ తో చేయబోయే చిత్రంలో ఎంటర్టైన్మెంట్ పాళ్ళు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. అలాగే త్రివిక్రమ్ సినిమాలు అంటే ఈ మధ్య ఒక టెంప్లేట్ కనిపిస్తోంది. దానికి తగ్గట్లే ఎన్టీఆర్30 కూడా ఉంటుందని సమాచారం.

త్రివిక్రమ్ సెంటిమెంట్స్ కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాడు. ఎక్కువగా ఆర్టిస్ట్ లను, సాంకేతిక నిపుణులను రిపీట్ చేయడానికి ఇష్టపడతాడు. అందుకే ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాలో పూజ హెగ్డేను మరోసారి హీరోయిన్ గా ఎంపిక చేయాలనుకుంటున్నాడట.  జరిగితే ఆమెతో వరసగా మూడో సినిమా చేస్తున్నట్లు. అలాగే ఈ మధ్య త్రివిక్రమ్ సినిమాలు అన్నీ ఇద్దరు హీరోయిన్స్ ఉన్నవే. ఎన్టీఆర్30లో కూడా ఇద్దరు హీరోయిన్స్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. త్రివిక్రమ్ కు అ సెంటిమెంట్ కూడా ఉంది. తన రీసెంట్ సినిమా టైటిల్స్ అన్నీ అ అక్షరంతో మొదలైనవే. ఎన్టీఆర్30 కు కూడా అయినను పోయి రావలె హస్తినకు అనే టైటిల్ ను ఫిక్స్ చేసిన విషయం తెల్సిందే. ఇలా సెంటిమెంట్స్ తోనే ముందుకు వెళ్తున్న త్రివిక్రమ్ ఎన్టీఆర్30తో మరో హిట్ ను ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నాడు.