జూలై ముగిసింది 3 హిట్స్ ఇచ్చింది


Ismart-shankar-Oh-baby-And-Lion-King
Ismart-shankar-Oh-baby-And-Lion-King

జూలై నెల ఈరోజుతో ముగిసిపోతుంది అయితే ఈ నెలలో చాలా సినిమాలే విడుదల అయ్యాయి కానీ హిట్స్ మాత్రం 3 మాత్రమే ! సమంత నటించిన ఓ బేబీ సూపర్ హిట్ అయ్యింది ,ఓవర్ సీస్ లో ఈ సినిమా వన్ మిలియన్ మార్క్ ని అందుకుంది . ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా భారీ వసూళ్ళని సాధించింది . ఇక ఓ బేబీ తర్వాత డబ్బింగ్ చిత్రం ” ది లయన్ కింగ్ ” కూడా భారీ వసూళ్లు సాధించి హిట్ గా నిలిచింది .

ఇక మూడో చిత్రం జూలై కి సరికొత్త ఊపునిచ్చింది అదే ఇస్మార్ట్ శంకర్ చిత్రం . పూరి జగన్నాధ్ , హీరో రామ్ హిట్స్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న సమయంలో పక్కా మాస్ సినిమాగా సంచలనం సృష్టించింది ఇస్మార్ట్ శంకర్ . ఇప్పటికే 30 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది రాబోయే రోజుల్లో మరో 10 కోట్ల షేర్ రాబట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు అంటే పక్కా బ్లాక్ బస్టర్ అన్నమాట . ఇక ఈ నెలలో విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ విడుదల అయ్యింది కానీ ఆశించిన స్థాయిలో అయితే విజయం సాధించలేక పోతోంది .