దర్శకుడు అట్లీ పై తీవ్ర ఆరోపణలు


తమిళ దర్శకుడు అట్లీ పై తీవ్ర ఆరోపణలు చేసింది ఓ జూనియర్ ఆర్టిస్ట్ . ఆరోపణలు చేయడమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది . రాజా రాణి , తేరి , మెర్సల్ చిత్రాలతో సంచలనం సృష్టించిన అట్లీ తాజాగా విజయ్ హీరోగా మరో సినిమాని రూపొందిస్తున్నాడు . కాగా ఆ సినిమా షూటింగ్ లో జూనియర్ ఆర్టిస్ట్ లకు సరైన భోజనం పెట్టడం లేదని ,అలాగే మర్యాద ఇవ్వడం లేదని వాపోతోంది జూనియర్ ఆర్టిస్ట్ .

 

మమ్మల్ని కుక్కలకంటే హీనంగా చూస్తున్నారని , ఇదేంటని అడిగినందుకు నన్ను షూటింగ్ జరుగుతున్న లొకేషన్ నుండి తరిమి కొట్టారని అసలు అట్లీ కి ఇదేమైనా న్యాయంగా ఉందా ? మేము మనుషుల్లా కనిపించడం లేదా ? అంటూ నిలదీస్తోంది ? అంతేకాదు చెన్నై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది . కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు .